MDK | మెదక్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

  • కేక్ కట్ చేసిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి
  • సంబరాలు చేసుకున్న నాయకులు
  • మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Party Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) (KTR) జన్మదిన వేడుకలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి (Former MLA Padmadevender Reddy) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం మెదక్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం (BRS Party Office)లో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు, గులాబి శ్రేణులతో కలిసి పద్మాదేవేందర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈసందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఆ భగవంతుడు మరింత మనోధైర్యాన్ని ఇచ్చి గట్టిగా పోరాడే శక్తిని ఇవ్వాలన్నారు.

గత 10 సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, ఐటి, పురపాలక సంఘం మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. పలు శాఖల మంత్రిగా ఉండి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. తెలంగాణ ను ప్రగతి పథంలో ముందుండి నడిపించారన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాడని, ప్రభుత్వంతో ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ కు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు,మాజీ కౌన్సిలర్లు జయరాజ్, ఆర్ కె శ్రీనివాస్, మాయ మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, న్యాయవాది జీవన్రావు, మెదక్, హవెలిఘనపూర్, చిన్న శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు యం. అంజగౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పట్లోరి రాజు, మెదక్ మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు కిష్టయ్య నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply