ఆలయాల అభివృద్ధే లక్ష్యం

ఆధ్యాత్మిక విలువల ప్రోత్సాహమే  కర్తవ్యం

పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్​

ఆంధ్రప్రభ, కృత్తివెన్ను (కృష్ణాజిల్లా) :  పెడన నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక విలువలను  ప్రోత్సాహించటమే  నా బాధ్యత,   కర్తవ్యం. ప్రాధాన్యత ఇవ్వటం ధ్యేయం అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్​ అన్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలోని  శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తల కమిటీ శుక్రవారం  ప్రమాణ స్వీకారం చేసింది.  ఈ కార్యక్రమంలో  నూతన చైర్మన్  చేకూరి వెంకట్రావు  ఇతర సభ్యులకు శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ , ఆయన  సతీమణి కాగిత శిరీష  అభినందనలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  దేవాలయాలు ప్రజల్లో భక్తి, శ్రద్ధ, సత్సంకల్పాలు పెంపొందించే కేంద్రాలుగా మారాలని, కొత్త కమిటీ సభ్యులు ఈ దిశగా చురుకుగా పనిచేయాలని, సేవాతత్పరతతో కమిటీ పనిచేసి భక్తుల‌ మన్ననలు పొందాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు భక్తులు గ్రామస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply