టీడీపీకి బీసీలే  వెన్నుదన్ను

వైసీపీవన్నీ దుష్ప్రచారాలే

టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల

( ఆంధ్రూప్రభ,  మచిలీపట్నం )  

వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసిన  బీసీలు తెలుగుదేశం పార్టీకే వెన్నుదన్నుగా ఉంటారని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ వాళ్లు ఒక వ్యక్తిగత తగాదాను తీసుకువచ్చి పార్టీ తగాదాగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం పార్టీ రజకులకు గాని, బీసీలకు గాని  వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ చేయదన్నారు. బీసీలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడాన్ని వైసీపీ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసి తెలుగుదేశం పార్టీ కి అప్రతిష్ట తీసుకురావాలని చూస్తున్నారని, అది ఏ మాత్రం జరగదన్నారు. వ్యక్తిగతంగా జరిగిన సంఘటన తీసుకొచ్చి రాజకీయం చేయాలని వైసీపీ వాళ్ళు చూడడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మటానికి ప్రజల సిద్ధంగా లేరని, ఇటువంటి ప్రచారాలు చేయబట్టే మీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందన్నారు.

Leave a Reply