కృష్ణాజిల్లా పోలీసుల హై అలర్ట్..

కృష్ణాజిల్లా పోలీసుల హై అలర్ట్..

కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఢిల్లీలో సంభవించిన పేలుళ్ల సందర్భంగా కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అంతట పోలీసులు అప్రమత్తమయ్యారు. దానిలో భాగంగా ఉయ్యూరు సీఐ రామారావు ఆధ్వర్యంలో బస్టాండ్ లోనూ, బస్సుల్లోనూ అలాగే లాడ్జిల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి అలానే అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు గాని వస్తువులు గురించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ నెంబర్ 112 కు తెలియపరచాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

Leave a Reply