కృష్ణ శతకం

16. ఎంతతేలిక గను పింతువో చిత్రమ్ము
అంతభారముగద అరసి చూడ
ఏవినోదమయిన ఏ విషాదమయిన
గీతదాత నీకు కేలుమోడ్తు

17. ఆ యశోద తల్లి కపురూపమైనట్టి
భాగ్యమిచ్చినావు బాలకృష్ణ
తల్లితల్లి కట్టి దర్శసమీయుమా
గీతదాత నీకు కేలుమోర్తు

18. మనసు భద్రమయ్యె మన సుభద్రనుపట్ట
అర్జునునకు జ్ఞాన ఆర్జనమ్ము
కలుగజేసినట్టి కంఠీరవుండవు
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *