73. ఆ యశోద తల్లి అద్భుతమాతయె
నిను భరించగలిగె నిబ్బరముగ
కొడుకుగాను పెద్ద దుడుకుతనముజూప
గీతదాత నీకు కేలుమోడ్తు
74. గరళకంఠుడెంత కష్టపడెనుజూడు
విషము మ్రింగినట్టి వేల్పుగాను
కాళియయను పాము గర్వమణచినావు
గీతదాత నీకు కేలుమోడ్తు
75. వెన్నదొంగవీవు కన్నెదొంగవు నీవు
దొంగతనమే నీదు దొరతనమ్ము
కోట్ల హృదయములను కొల్లగొట్టినవాడ!
గీతదాత నీకు కేలుమోడ్తు