Skip to content- మాటలు వినసొంపు మహిమలు కన ఇంపు
ఆటలన్న నీవి అద్భుతమ్ము
మనసుజూడ మేము మైమరతుము సామి
గీతదాత నీకు కేలుమోడ్తు - మేనమామ కంసు ప్రాణాలు తీసిన
వీరుడవయ మేటి ధీరుడవయ
మేనయత్త రాధ ప్రాణప్రదమునీకు
గీతదాత నీకు కేలుమోడ్తు - నందనందనునకు వందనములు లక్ష
పెట్టుమయ్య మాకు ప్రేమ భిక్ష
సర్వజంతుతతికి సర్వస్వమే నీవు
గీతదాత నీకు కేలుమోడ్తు