కృష్ణ శతకం

4. జన్మమెత్తు మొదలు చావు వరకు కూడ
క్షణము క్షణము సాగు రణముతోడ
గీతవిన్న నుదుటి రాత మారును కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు

5. గోతులన్ని త్రవ్వి నీతులు వల్లించు
పెద్దమనుషులున్న పద్దులెన్నొ
డొక్కచీల్చి చూచి డోలు కట్టుము సామి
గీతదాత నీకు కేలుమోడ్తు

6. ప్రేమ కోసమంచు వెంటబడెడువాడు
పెండ్లి ఊసులెత్త పిరికియగును
పెద్దలడ్డుఅనుచు వెనుకంజవేయును
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *