46. రోలుకేసికట్ట రోలుమోదలగుచు
లాగివెడలినట్టి లావునీది
జగతి ఊయలందు ఊగినవాడవు
గీతదాత నీకు కేలుమోడ్తు
47. కనులు లేనియట్టి కౌరవపితకును
విశ్వరూపమంత వేడుకను
చూపినట్టివాడ స్తుతిపాత్రుడవు నీవు
గీతదాత నీకు కేలుమోడ్తు
48. ఉట్టికొట్టినట్టి గట్టివాడవునీవు
పంచపాండవులకు పక్షపాతి
ధర్మపక్షపాతి దండాలు నీకయ్య
గీతదాత నీకు కీలుమోడ్తు