కృష్ణ శతకం

34. లౌక్యమందు నమ్మశక్యముగానట్టి
ప్రతిభజూపు విశ్వపతివి నీవు
తెలివితేటలన్న దివ్యరత్నాలయ్య
గీతదాత నీకు కేలుమోడ్తు

35. ఆంతరంగికుండు నా కుచేలుని జూచి
ఆదుకొంటివయ్య అవసరమున
పరమమిత్రులైన భక్తులేగద స్వామి
గీతదాత నీకు కేలుమోడ్తు

36. తులసిదళమె మిన్న తులతూగ నగలకు
రుక్మిణిపయి ప్రేమ రూపుదాల్చె
ఎంత దేవుడైన ఇంతికి దాసుడే
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply