1. శ్రీని పెండ్లియాడ చిక్కులు తొలగిన
విఋధవర్య! నుతులు వేనవేలు
వ్యాపకుడవు నీవు దీపకుడవునీవు
గీతదాత నీకు కేలుమోడ్తు
2. నారినారి నిలువ నడుమ మురారియై
తిరుగుచుండువాడ దిశదిశలను
ఒక్కభార్యతోనె దిక్కుతోచదు మాకు
గీతదాత నీకు కేలుమోడ్తు
3. అష్టభార్యలన్న అందోళనయె లేదు
పదియునారు వేలపడతులున్న
బాధయేమిలేని పరమాత్ముడవు నీవు
గీతదాత నీకు కేలుమోడ్తు