Kovvur | వంతెన పై బస్సు దగ్దం..

Kovvur | వంతెన పై బస్సు దగ్దం..

Kovvur, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కొవ్వురు ఫ్లైఓవర్ పై బుధవారం వేకువజామున ట్రావెల్ బస్సు దగ్దమైంది. డీఎస్పీ దేవకుమార్, సీఐ కే.విశ్వం తెలియచేసిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళుతున్న ట్రావెల్ బస్సు కొవ్వురు ప్లైఓవర్ కి వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు రావడంతో దగ్దమైంది. సెల్ఫ్ మోటర్ షార్ట్ సర్క్యూట్ వలనే ఇలా జరిగిందని తెలిసింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపేసాడు.

వెంటనే అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేసారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. దాదాపు 80 లక్షల మేర నష్టం జరిగిందని అంచనా వేసినట్లు అగ్నిమాపక అధికారి ఏవీఎస్ఎస్ వేణు తెలిపారు.

Leave a Reply