కొత్తమ్మ తల్లీ నమో నమ
- అంబరాన కొత్తమ్మ తల్లి సంబరాలు
- భారీగా తరలిన ఘటాలు
- ప్రశాంతంగా ముగిసిన కొత్తమ్మ శతాబ్ది ఉత్సవాలు
కోటబొమ్మాళి శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : కోటి వరాలిచ్చే వల్లి కొత్తమ్మ తల్లి(Valli Kothamma’s mother) పిల్లాపాపలను చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లిని వేడుకున్నారు. కొత్తమ్మ తల్లి సంబరాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల శతాబ్ది వార్షిక జాతర ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. స్థానిక రెడ్డిక(Reddika) వీధిలోని కమ్మకట్టు చిన్నప్పల నాయుడు(Chinnappala Naidu) నివాసంలో మూడు రోజులుగా ఉంచిన అమ్మవారిని జంగడిలో అమర్చి డప్పులు మేళ తాళాలతో అమ్మవారి(Ammavari) భక్తురాలు బయలుదేరగా ఆమె వెంట గ్రామ పెద్దలు, యువకులు, వేలాదిగా మహిళలు ఇంటింటా ముంత్రాలతో ఘటాలను తలపైన పెట్టుకొని వేప కొమ్మలు చేతబట్టి, భారీ ర్యాలీ( huge rally)గా మెయిన్ రోడ్డు మీదుగా కొత్తమ్మ తల్లి ఆలయం వరకు వెళ్లారు.
అమ్మవారిని ఆలయంలో అప్పగించిన అనంతరం ముంత్రాలు, వేటలతో చల్లదనం చేశారు. పండ్లు, కాయలు, చీరలు సమర్పించుకున్నారు. ఇంతటితో మూడు రోజుల వార్షిక జాతర ఉత్సవాలు ముగించినట్లయింది. ఈ కార్యక్రమం టెక్కలి రూరల్ సీఐ కే శ్రీనివాసరావు(Tekkali Rural CI K Srinivasa Rao) ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది రోప్ పార్టీ(rope party)గా ఏర్పడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కార్యక్రమం ముగించారు.
కాగా చివరి రోజు గురువారం నాడు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు రోజులుగా బోసిపోయిన క్యూ లైన్లన్నీరద్దీగా కనిపించాయి. పలువురు ప్రముఖులు వచ్చి కొత్తమ్మతల్లిని దర్శించుకున్నారు.
ఏర్పాట్లు భేష్ :
కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను భేష్ అంటూ పర్యాటకులు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడింగ్, లేజర్ షో, బాణాసంచా, క్రీడల పోటీలు, శోభాయాత్ర, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి గర్భగుడిలోనూ రాజగోపురం ఆహ్వాన మార్గం వద్ద, ఆలయ ప్రాంగణంలోను అద్భుతమైన పూల అలంకరణ అందరిని ఆకర్షించింది. అమ్మవారి ఉత్సవాలకు మరింత శోభనిచ్చింది.
అంతేకాకుండా భక్తుల కోసం రెండు చోట్ల ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రసాదాల పంపిణీ, తాగునీరు, మజ్జిగ పంపిణీ, వైద్య శిబిరాలు పలు ఎగ్జిబిషన్లు భక్తులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సూచనలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, టెక్కలి ఆర్డిఓ, ఇతర అధికారులు మండల స్థాయి అన్నిశాఖల అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పాలకమండలి ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయి.


