Kondagattu Fire Accident | భారీ అగ్ని ప్రమాదం..

Kondagattu Fire Accident | భారీ అగ్ని ప్రమాదం..

Kondagattu Fire Accident, కొండగట్టు, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున పెద్ద హనుమాన్ విగ్రహం నుండి జగిత్యాల కరీంనగర్ హైవే వరకు దాదాపు 25 బొమ్మల షాపులు మంటలకు బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. జగిత్యాల నుండి ఒక్క ఫైర్ ఇంజన్, ధర్మపురి నుండి ఒక ఫైర్ ఇంజన్, కరీంనగర్ (Karimnagar) నుండి ఒక ఫైర్ ఇంజన్ కొండగట్టుకు చేరుకోవడంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం తెలియలేదని.. ప్రాణ నష్టం ఏమీ లేదని.. మిగతా సమచారం అందిస్తామని అగ్నిమాపకదళ సిబ్బంది తెలిపారు.

Leave a Reply