Kollywood | ఏవీఎం శరవణన్ ఇకలేరు

Kollywood | ఏవీఎం శరవణన్ ఇకలేరు..
Kollywood, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రముఖ తమిళ నిర్మాత, ఏవీఎం సంస్థల అధినేత శరవణన్ (AVM Saravanan) కన్నుమూశారు. ఆయన వయసులు 85 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఆయన నివాసంలో గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించారు. ఏవీఎం బ్యానర్ పై పలు విజయవంతమైన సినిమాలను నిర్మించి.. సంచలన విజయాలు సాధించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, జెమినీ తదితర చిత్రాలు నిర్మించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియచేశారు.
