కోల్‌కతా : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 39వ ఐపీఎల్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు టాప్ జట్టు అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది (KKR vs GT). వరుస విజయాలతో దూసుకుపోతున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది తెలియాలంటే మ్యాచ్ ను చూడాల్సిందే.