అనారోగ్యంతో కొలాం మహిళా మృతి

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని కాకడ బుడ్డి గ్రామానికి చెందిన కులం మహిళ పాత్ర గుండుబాయి (44) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కొలాం సంఘ నాయకులు సీడం రాజు, ఆత్రం బాపూరావు ఆమె బంధువులు తెలిపారు. మృతురాలకు ఇద్దరు కూతుర్లు ఒక్క కొడుకు ఉన్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా అదిలాబాద్ ఆసుపత్రిలో చికిత్సలు చేసి హైదరాబాదులో చికిత్సలు చేయించిన నయం కాలేదని వారు తెలిపారు. అనారోగ్యంతో గుండు బాయి మృతి చెందడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
