అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత….

అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత….
కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఎస్సై చాణిక్య, వీఆర్వో బాబురావులు పట్టుకున్నారు.
కోడూరు గ్రామ పరిధిలోని దింటి మెరక గ్రామ పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
