- 20 మంది ప్రయాణికులకు గాయాలు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పన్నపేట – అందుగులపల్లి మధ్య రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద రోడ్డు మరమత్తు పనులు జరుగుతున్నందున వన్ వే ఏర్పాటు చేశారు. ఎదురుగా వస్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రయాణికులను చికిత్స కోసం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.