ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు దంచికొడుతున్నారు. తొలి ఓవర్లలోనే వికెట్లు పడినా.. టీం స్పిరిట్ కోల్లోకుండా కెప్టెన్ అజింక్యా రహనే (26 బంతుల్లో 38), యంగ్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ (21 బంతుల్లో 30) కలిసి హైదరాబాద్ బౌలర్లను ఉతికారేస్తున్నారు.
వీరిద్దరూ కలిసి 3వ వికెట్ కు 51 బంతుల్లోనే 81 పరుగుల భాగస్వమ్యం నెలకొల్పారు. దీంతో కేకేఆర్ జట్టు 10 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి పరుగులు 84 సాధించింది.
అయితే, ఆ తరువాతి ఓవర్ ఆఖరి బంతి(10.6)కి కెప్టెన్ రహానే 38 పరుగులుకు జీషాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
కాగా, విధ్వంసకర బ్యాటర్లు క్వింటన్ డి కాక్ (1), సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్‌కే డగౌట్‌కు చేరుకున్నారు. 1.5 ఓవర్లలో క్వింటన్ డి కాక్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ క్యాచ్ అవుట్ చేయగా, షమీ బౌలింగ్‌లో సునీల్ నరైన్ 2.3వ బంతికి బౌల్డ్ అయ్యాడు.