ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు (ఆదివారం) రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా జట్టు డిఫెండబుల్ స్కోర్ నమోదు చేసింది. తమ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్… నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది.
కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (35), కెప్టెన్ అజింక్యా రహానే (30), అంగ్క్రిష్ రఘువంశీ (44) రాణించగా.. ఆండ్రీ రస్సెల్ (51) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ (19) ధనాధన్ బౌండరలతో మెరిశాడు. దీంతో కోల్‌కతా స్కోర్ బోర్డుపై 206 పరుగులు నమోదయ్యాయి.
ఇక రాజస్థాన్ బౌలర్లలో జాఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహేష్ తీక్షణ, రియాన్ పరాగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 207 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ ఛేజింగ్‌కు దిగనుంది.