భారత వ్యవసాయ రంగ సమస్యల పైన పోరాడే సంఘం ఏఐకేఎస్

భారత వ్యవసాయ రంగ సమస్యల పైన పోరాడే సంఘం ఏఐకేఎస్

రైతాంగ సమస్యలకు కొత్తగూడెం వేదిక కాబోతుంది
అన్నవరపు సత్యనారాయణ వెల్లడి
.

ములకలపల్లి, ఆంధ్రప్రభ : భారతదేశంలో స్వాతంత్రం పూర్వం నుండి వ్యవసాయ రంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సంఘం అఖిల భారత కిసాన్ సభ (AIKS) మాత్రమేనని అందులో భాగంగానే రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారానికి కొత్తగూడెంలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు వేదికగా నిలుస్తాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ వెల్లడించారు.

గురువారం ములకలపల్లి లో స్థానిక కార్యాలయంలో లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఆనాటి జమీందారులు జాగీర్దార్లు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని పండించిన పంటపై హక్కు ఉండాలని వెట్టిచాకిరి నశించాలని డిమాండ్ చేస్తూ 1936 ఏప్రిల్ 11వ తేదీన అఖిల భారత కిసాన్ సభని లక్నో కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

ఆనాటి నుండి నేటి వరకు దేశంలో రైతాంగ సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న ఏకైక రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ మాత్రమేనని ఆయన తెలిపారు ఆ సంఘానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్రంలో రైతాంగ సమస్యల పైన నికరంగా నిలబడి పోరాడుతుందని నేడు రైతులు ప్రధానంగా గిట్టుబాటు ధర బీమా రుణమాఫీ వంటి సమస్యలలో ఉన్నారని వాటిపై అన్ని రైతు సంఘాలని రైతాంగాన్ని సమీకరించి పోరాడుతున్న సంఘంగా తెలంగాణ రైతు సంఘం ఉందని ఆయన పేర్కొన్నారు.

నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవర్ణ చట్టం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతాంగం తీవ్రంగా రోడ్ల పడే పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు సంక్షేమ పథకాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన తెలిపారు ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగానే సమీకరించి పోరాడటానికి ఈ నెల 23 24 25 తేదీలలో కొత్తగూడెం కేంద్రంలో జరగబోతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు వేదికగా నిలుస్తాయని అని తెలిపారు.

ఆ మహాసభలలో రైతాంగం సంబంధించిన అన్ని రకాల సమస్యల పైన చర్చించి తీర్మానాలు రూపొందించి కార్యచరణ ప్రణాళికను తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్, నాయకులు గోపగాని లక్ష్మీ నర్సయ్య, పుప్పాల హరినాథ్, హేమాని, బైరు ప్రసాద్, భుక్యా శ్రీదేవి, గడ్డం వెంకటేశ్వర్లు, పెంకె భద్రం, సున్నం నాగులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply