Kinjarapu Atchannaidu | నాణ్యత పాటించాలి..
- త్వరితగతిన కలెక్టరేట్ భవన సముదాయం పూర్తి చేయాలి
- వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
Kinjarapu Atchannaidu | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : సమీకృత కలెక్టర్ (Collector) కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనముగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని (ఐసీసీ) జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, రోడ్లు భవనాలు శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవన (Bulding) నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. నమూనా ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

