రాజు మరణం… తీరని లోటు..
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుడు అల్వాల రాజు(Aluvala)(40) ఈ రోజు గుండెపోటుతో మృతి చెందాడు. రాజు మృతి పట్ల అఖిలభారత కార్మిక సంఘం (ఏఐసిటియు )తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతదేహంపై పూలమాల వేసి ఎండి మా షూక్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు(Municipal Workers) నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన అల్వాల రాజు మరణించడం కుటుంబానికి ఎంతో తీరని లోటు అని, అందరితో కలుపుగోలుగా ఉండే రాజు అతి చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించి, అతని భార్యకు పెన్షన్(Pension) సౌకర్యం కల్పించాలని మున్సిపాల్టీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు మాదాసి సారయ్య , నాతి రాజు, కందిక స్వామి, రాజేష్, శ్రీను, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

