Khel Khud | ప్రారంభమైన విభాగ్ స్థాయి ఖేల్ ఖూద్ పోటీలు

Khel Khud | ప్రారంభమైన విభాగ్ స్థాయి ఖేల్ ఖూద్ పోటీలు

Khel Khud | ముధోల్, ఆంధ్రప్రభ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఈ రోజు విభాగ్ స్థాయి ఖేల్ కూద్ పోటీలను నిర్వహించా రు.ఈ పోటీలను శ్రీ సరస్వతి విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు భజరంగ్ లాల్ అగర్వాల్, మండల విద్యాధికారి గోపీడి రమణారెడ్డి, ముఖ్య అతిథి యార్ల గడ్డ శ్రీనివాసరావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతితో కూడిన విద్య అందిస్తూ విద్యార్థుల దేహ దారుఢ్యం(Physical strength), మానసిక వికాసం కోసం ఖేల్ ఖుద్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విభాగ్ స్థాయి ఖేల్ కూడాలో నిర్మల్, అదిలాబాద్ జిల్లాలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల నుండి సుమారు 600 మంది(600 people) విద్యార్థులు పాల్గొన్నారు.

Khel Khud |

పోటీలను ప్రారంభించి న అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు కబడ్డీ , ఖో ఖో, తదితర పోటీల్లో హోరా హోరీగా పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు దీంతో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్,జిల్లా కార్యదర్శి గోపాల్ కిషన్, ముధోల్ పాఠశాల సమితి అధ్యక్షులు రవీంద్రనాథ్ పాండే, కొండా వార్ సంజీవ్, లోకేశ్వరం మాజీ యంపిపి నగరం నారాయణరెడ్డి, రోల్ల రమేష్, ప్రధానాచార్యులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Khel Khud |
Khel Khud |

Khel Khud |
Khel Khud |

Khel Khud |

Leave a Reply