TG | రోశ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఖ‌ర్గే

  • రోశ‌య్య‌కు ఘ‌న నివాళులు
  • 16సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోశ‌య్య‌కు అరుదైన రికార్డు
  • సీఎం రేవంత్ రెడ్డి


హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, త‌మిళనాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య ((Konijeti Rosaiah) కాంస్య విగ్ర‌హాన్ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjuna Kharge) శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. రోశ‌య్య జ‌యంతి సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, రోశ‌య్య కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

ల‌క్డీకాపూల్‌లో రోశ‌య్య విగ్ర‌హం ఏర్పాటు..
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎక్కువ సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ద‌వుల‌ను అలంక‌రించిన కొణిజేటి రోశ‌య్య కాంస్య విగ్ర‌హాన్ని ల‌క్డీకాపూల్‌లో ఏర్పాటు చేశారు. లక్డీకాపూల్ (Lakdikapool) లోని మెట్రో స్టేషన్‌ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఇవాళ రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అరుదైన రికార్డు సాధించిన రోశ‌య్య‌..
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16సార్లు ఆర్థికశాఖ మంత్రి హోదాలో రోశయ్య బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప‌ద‌వుల‌కే వ‌న్నే తీసుకు వ‌చ్చార‌న్నారు.

Leave a Reply