Kharg Island Strike : ఇరాన్ ఆయువు పట్టు ధ్వంసం Andhra Prabha News

Kharg Island Strike : ఇరాన్ ఆయువు పట్టు ధ్వంసం Andhra Prabha News

  • ఖార్గ్ ద్వీపం ధ్వంసం
  • అమెరికా బాంబుల వర్షం
  • ఇరాన్‌కు భారీ షాక్..
  • సైనిక స్థావరాలు నేలమట్టం
  • ట్రంప్ ప్రకటనతో ప్రపంచం షాక్..
  • హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత..
  • అమెరికా కొత్త హెచ్చరిక
  • పశ్చిమాసియాలో యుద్ధ మంటలు..

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్)

Kharg Island Strike

ఇరాన్ ఆయువు ప‌ట్టు.. ర‌త్న కిరీటంగా పేరొందిన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేఏసింది. ఈ ద్వీపంలో ఇరానియ‌న్ సైన్యం స్థావ‌రాల‌ను తుడిచి పెట్టిన‌ట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. భారతీయ కాలమానం (IST) ప్రకారం: ఈ దాడి మార్చి 14, 2026 (శనివారం) తెల్లవారుజామున సుమారు 4:30 గంటల నుండి 5:30 గంటల మధ్య జరిగినట్లు మీడియా స‌మాచారం. అమెరికా కాల‌మానం ప్రకారం మార్చి 13 రాత్రి సుమారు 8:00 – 9:00 గంటల మధ్య ఈభారీ దాడి జరిగింది.

Kharg Island Strike : ఇరాన్​ రత్న కిరీటం ధ్వంసం

Kharg Island Strike

ఖార్గ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలను (Military Targets) అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం (Obliterated) చేశాయని ట్రంప్ ప్రకటించారు. మానవతా దృక్పథంతో ప్రస్తుతం చమురు నిల్వలు, ఎగుమతి కేంద్రాలపై (Oil Infrastructure) దాడి చేయలేదని, ఇరాన్ ఇదే రీతిలో హోర్ముజ్ జ‌ల‌సంధి మీదుగా నౌకల రాకపోకలను అడ్డుకుంటే .. ఇరాన్ నౌక‌ల‌నూ ధ్వంసం చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా యుద్ధ విమాన వాహక నౌక ‘అబ్రహం లింకన్’ పై దాడి చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రతిదాడి చేపట్టింది. ఖార్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులలో సుమారు 90% వాటాను కలిగి ఉంది. ఈ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుమారు 40% వరకు పెరిగాయి.

Kharg Island Strike : తుడిచేశాం : అమెరికా అధ్యక్షుడు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని ముడి చ‌మురు ఎగుమతుల కీలక కేంద్రం ఖార్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం భారీ బాంబు దాడి చేసిందని, హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలిగితే ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యూహాత్మక ద్వీపంపై అమెరికా దళాలు భారీ స్థాయిలో దాడి చేశాయని, ఈ దాడిని ఈ ప్రాంతంలో నిర్వహించిన అత్యంత శక్తివంత కార్యకలాపాలలో ఒకటిగా అభివర్ణించారని ట్రంప్ అన్నారు. “యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్య చరిత్రలో అత్యంత శక్తివంత బాంబు దాడులను నిర్వహించింది . ఇరాన్ కిరీట రత్నం ఖార్గ్ ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది” అని ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు.

Kharg Island Strike : ఇక హార్ముజ్ జలసంధే టార్గెట్​

హార్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణాకు ముప్పు ఉంటే వాషింగ్టన్ ద్వీపం చమురు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవచ్చని కూడా ఆయన హెచ్చరించారు.”నేను ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టకూడదని ఎంచుకున్నాను. ఇరాన్ లేదా మరెవరైనా హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల స్వేచ్ఛా సురక్షిత ప్రయాణానికి అంతరాయం కలిగించడానికి ఏదైనా చేస్తే, నేను వెంటనే పునరాలోచిస్తా అని ట్రంప్​ హెచ్చరించారు.

Kharg Island Strike దాడి నిజ‌మే.. చ‌మురు సేఫ్ : ఇరాన్

Kharg Island Strike

ఇరాన్ చ‌మురు దీపిక‌.. ఖార్గ్ ద్వీపాన్ని ధ్వంసం చేశాయ‌మ‌ని, ప్ర‌తి సైనిక స్థావ‌రాన్ని మ‌టాష్ చేశామ‌ని అగ్ర‌రాజ్య నేత డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌గ‌టించిన కొన్ని గంట‌ల్లోనే.. ఖార్గ్ పై అమెరికా దాడి నిజ‌మే.. కానీ చ‌మురు నిల్వ‌ల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేద‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది. ఆ ద్వీపంలో 15 కి పైగా పేలుళ్లు సంభవించాయని, ఆర్మీ రక్షణలు, జోషెన్ సముద్ర స్థావరం, విమానాశ్రయ నియంత్రణ టవర్ , హెలికాప్టర్ హ్యాంగర్‌ను అమెరికా లక్ష్యంగా బాంబుల‌తో

Kharg Island Strike

దాడి చేయ‌గా.. దట్టమైన పొగ ఎగసిందని ఏజెన్సీ ఇరాన్ క్షేత్ర వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి దాదాపు 90% ముడి చమురు ఎగుమతులు నిర్వహించే ఈ చిన్న ద్వీపం ఖార్గ్‌లోని “ప్రతి సైనిక లక్ష్యం”పై అమెరికా బాంబు దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రాత్రి అన్నారు. నిజానికి ఖార్గ్ ద్వీపం.. 90% ఇరాన్ చమురు రవాణాకు ఎగుమతి టెర్మినల్, ఇది జలసంధికి వాయువ్యంగా 300 మైళ్ళు (483 కిమీ) దూరంలో ఉంది. ఈ దాడుల‌పై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్ సాయుధ దళాలు శనివారం స్పందిస్తూ తమ దేశ చమురు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఈ ప్రాంతంలో అమెరికాతో సహకరించే చమురు కంపెనీల స‌దుపాయాల‌పై దాడులు జరుపుతాయని ఇరాన్ హెచ్చ‌రించింది.

Kharg Island Strike లొంగిపోతే మీకే మంచిది : ట్రంప్​

ఈ ద్వీపంలోని సైనిక లక్ష్యాల‌ను అమెరికా ‘నాశనం’ చేసింది, ట్రంప్ అన్నారు అమెరికా దాడుల నుండి త‌న‌ను తాను రక్షించుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదని అమెరికా అధ్యక్షుడు జోడించారు. “ఇరాన్ సైన్యం ఈ ఉగ్రవాద పాలనతో మ‌మేకం అయిన వారందరూ తమ ఆయుధాలను విడిచి , త‌మ దేశంలో మిగిలిన న్న వాటిని కాపాడుకోవడం . తెలివైన పని, ఇది పెద్ద విషయం కాదు!” అని ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

also read : Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News

Leave a Reply