Khanapur | పాలకురాలు కాదు.. సేవకురాలు..

Khanapur | పాలకురాలు కాదు.. సేవకురాలు..

Khanapur | మంథని, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీవీ రిమోట్ కు ఓటు వేసి, ఆశీర్వదించాలని సంగెం అరుణ గట్టయ్య కోరుతున్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అండతో ఖానాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలుపుతున్నాను. మంథని మండలంలో సంగెం అరుణాక్క గెలుపు దాదాపు ఖాయమని ఖానాపూర్ గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీవీ రిమోట్ కు ఓటెయ్యాలని, ప్రజాసేవకు అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు. సంగెం అరుణ గట్టయ్య చేసిన ప్రచారంలో ప్రజలే ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు. ప్రజలంతా అడుగడుగునా ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. సామాజిక న్యాయం జరగాలంటే అరుణక్క గెలిచి తీరాలని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు.

సర్పంచ్ గా గెలిచిన తర్వాత అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని.. ఆమె భరోసా కల్పిస్తున్నారు. గ్రామస్తులంతా స్వయంగా ఆమె కోసం వాడవాడల ప్రచారం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీవీ రిమోట్ గుర్తు పై ఓటేసి గెలిపించాలని, గెలిచిన తర్వాత గ్రామంలో కోతుల బాధ నుండి విముక్తి కల్పిస్తానని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో నిరుపేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. నిరుపేద ప్రజల కోసం ఎల్లవేళలా అండగా ఉంటానని.. గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తానని ఆమె తెలిపారు.

ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని.. ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని అన్నారు. మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు. గ్రామంలో రోడ్ల మరమ్మత్తులు, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆయన వివరించారు. ప్రజలు మెచ్చేలా, ప్రజలు విశ్వసించేలా పాలకురాలుగా కాకుండా సేవకురాలిగా పని చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply