Khammam | రోటవేటర్ రూపంలో మృత్యువు…
Khammam | వైరా, ఆంధ్రప్రభ : రోటవేటర్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.. ట్రాక్టర్ నేర్చుకోవాలనె తపనతో వెళ్లిన ఓ యువకున్ని రోటవేటర్(Rotavator) రూపంలో మృత్యువు కబళించింది.. గుర్తుపట్టని స్థితిలో మృతదేహం చెందరవందరగా మారింది.. వైరా మండల పరిధిలోని పుణ్యపురం గ్రామానికి చెందిన చిర్రా హరీష్(Chirra Harish)(24) రోటవేటర్ కిందపడి ఈ రోజు దుర్మరణం చెందాడు..
వివరాల్లోకెళ్తే.. ట్రాక్టర్ తోలటం నేర్చుకునేందుకు వెళ్లిన హరీష్(Harish) అనే యువకుడు ప్రమాదవశాత్తు రోటవేటర్ కిందపడి దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ ఇంజన్ వెనక భాగంలో వున్న బల్లపై కూర్చున్న యువకుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజన్(tractor engine)కు రోటవేటర్ కు మధ్య పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రోటవేటర్ ఆ యువకుడు పై నుంచి వెళ్లడంతో మృతదేహం చింద్రమై గుర్తు పట్టని విధంగా మారింది..
గ్రామంలోని వాకదాని కృష్ణయ్యకు చెందిన ట్రాక్టర్ వాకదాని వెంకన్న పొలంలో రోటవేటర్ వేసేందుకు కృష్ణయ్య కుమారుడు వాకదాని అప్పారావు వెళ్లారు. ట్రాక్టర్ నేర్చుకోవాలనే కుతూహలంతో అప్పారావు(Apparao)తో కలిసి హరీష్ పొలానికి వెళ్ళాడు. అయితే అప్పారావు ట్రాక్టర్ నడుపుతూ రోటవేటర్ వేసే సమయంలో హరీష్ టాక్టర్ ఇంజన్ వెనుక ఉన్న బల్లపై కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు హరీష్ ఆ బల్లపై నుంచి జారి ట్రాక్టర్ కు రోటవేటర్ కు మధ్య పడిపోయాడు. దీంతో హరీష్ పైనుంచి రోటవేటర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైరా ఎస్సై పుష్పాల రామారావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనఫై ఎస్ఐ విచారణ నిర్వహించి కేసు నమోదు చేశారు.

