Key comments | పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

Key comments | పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

  • తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్

Key comments | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్‌కు స్పష్టంగా చెప్పామని తెలిపారు.

సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బంధీ కానీయొద్దని తెలిపారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు బాధితుడినే అన్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు లేని భయం.. విచారణ సమయంలో మొదలైందని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు చేయని అవినీతి లేదని విమర్శించారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ బాగుపడలేదన్నారు.

Leave a Reply