ఉట్నూర్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఐబి చౌరస్తాలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇన్చార్జి పార్టీ అధ్యక్షులు జై వంతరావు మాట్లాడుతూ కెసిఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని, ఆయన 10 ఏళ్ల ముఖ్యమంత్రి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఎండి సలీమోద్దీన్ , న్యాయవాది పెందూర్ ప్రభాకర్, సీడం సోనేరావు, ఉట్నూర్ మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రషీద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
