హైదరాబాద్ : బి సీ రిజర్వేషన్ల విషయంలో ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌పై అధివారం దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మన్ లు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు గన్‌మన్ల వ్యవహారంపై పోలీసుల ఫోకస్ పెట్టింది. ఇద్దరు గన్‌మన్లను వెనక్కి పిలిచారు. . ఆ ఇద్దరి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది పోలీస్ శాఖ. తీన్మార్ మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్‌మెన్ లు చెప్పినట్లు సమాచారం..
ఇక కవిత నివాసంతో పాటు జాగృతి కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. ఇటు మల్లన్న, కవిత ఎసిసోడ్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కవిత, మల్లన్న ఇద్దరూ సంయమనంతో వ్యవహరించాలని… దాడులు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి కాదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.