కాసిపేట, ఏప్రిల్ 10 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పల్లంగూడ పంచాయతీ పరిధిలోని గొండుగూడ (యాప) కు చెందిన వెడ్మ కిషన్ (33) అనే రైతు కరెంట్ షాక్ గురై మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రాత్రి స్నానం కోసం నీళ్లు పట్టేందుకు కరెంట్ మోటార్ వేయగా, విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే పడిపోయినట్టు తెలిపారు.
గుర్తించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, అప్పటికే కిషన్ మృతిచెందాడని నిర్ధారించారని వివరించారు. మృతుడికి భార్య, తల్లి ఉన్నారు. గిరిజన సంఘాల్లో చురుగ్గా పాల్గొనే కిషన్ చనిపోవడం బాధాకరమని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ఆదివాసి సంఘాల నాయకులు తెలిపారు.