కరుణగిరి పుణ్యక్షేత్రంలోని విశ్వాసులకు సకల సౌకర్యాలు..

కరుణగిరి పుణ్యక్షేత్రంలోని విశ్వాసులకు సకల సౌకర్యాలు..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఆర్సియం జిల్లా పుణ్యక్షేత్రం పీఠాధిపతులు బిషప్ డిడి డాక్టర్ సగిలి ప్రకాష్ ఆదేశాలతో కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్లు రెవరెండ్ ఫాదర్స్ జ్వానేస్,ఆంథోనీ రాజ్, ఖమ్మం జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్, ఫాదర్ కాకమాను రాజు సారధ్యంలో జరిగే పుణ్యక్షేత్ర మహోత్సవానికి విచ్చేస్తున్న విశ్వాసులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల సదుపాయాలు మౌలిక సౌకర్యాలను కల్పించడం జరిగిందని, రెక్టర్ డైరెక్టర్ ఫాదర్ జానేస్, ఆంథోనీ రాజు తెలిపారు. అదే క్రమంలో ఖమ్మం జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్ కాకమాను రాజు సూచనల మేరకు జ్యోతిర్మయి యానిమేటర్లు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పక అహర్నిషులుగా ట్రాఫిక్ విధులు నిర్వహించడం గర్వకారణమని కొనియాడారు.

ఉమ్మడి రాష్ట్రాలు, జిల్లాలు మొదలుకొని కరుణగిరి పుణ్యక్షేత్రయాత్రా మహోత్సవాలకు భక్తులు తండోప తండాలుగా తరలిరావడం జరుగుతుండంతో, బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ కావడంతో రద్దీతో కూడిన వాహనాలు మార్గాలకు తరలించడం, భక్తులను దివ్యబలి సమర్పణ ఆరాధన పూజల్లో పాల్గొనేలా విధులను నిర్వహించడం గర్వకారణమని జ్యోతిర్మయి డైరెక్టర్ ఫాదర్ కాకమాను రాజు అభినందించారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 02 వరకు ఖమ్మం కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవ ఉత్సవాలకు ప్రముఖ దైవ సందేశకులు, ఆధ్యాత్మిక, స్వస్థత వరాలు కలిగిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైస్ వీసీ మెర్సీ రిట్రీట్ ఫాదర్ జైసన్ ప్రసంగంతో పాటు, విజీ తప్పేటశౌరీ గురువు, విశ్రాంత బిషప్ పాల్ మైపన్ బిషప్ దివ్యబలి పూజను సమర్పిస్తారని గుర్తు చేశారు.

సోమవారం ముగింపు పూజల్లో క్రైస్తవ భక్తులు, విశ్వాసులు,భారీఎత్తున భక్తిశ్రద్ధల ఉజ్జివ సభల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జ్యోతిర్మయి యానిమేటర్ల కోఆర్డినేటర్ శౌరి, యానిమేటర్లు సుందర్రావు, ప్రసాద్, యేసురాజు, చిన్నప్ప, పాస్కాలి, శాంతయ్య, మోహన్రావు, బాబురావు, దేవానందం, బాలస్వామి, యోహాను, ఆంధ్రప్ప,ఆళ్లపల్లి విచారణ జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, బ్రదర్స్, సిస్టర్స్, గురువులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply