ఉమామహేశ్వరంలో కార్తీక శోభ
- ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించిన భక్తులు
- కార్తీక దీపాలను వెలిగించిన భక్తులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : శ్రీశైలం ఉత్తర ద్వారంగా విరజిల్లుతున్న ఉమామహేశ్వరం(Umamaheswaram) క్షేత్రంలో ఈ రోజు ఉదయం కార్తీక మాస శోభను సంతరించుకోగా భక్తుల ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ ప్రధాన అర్చకులు పాపగంటి వీరయ్య, అర్చకులు ప్రాఃతకాలమందే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, దీపాలంకరణ చేశారు.
భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కొండపైకి పోటెత్తి ఉమామహేశ్వరులను దర్శించుకొని ప్రత్యేక పూజల(special pujala)లో పాల్గొన్న అనంతరం ఆలయం ముందు కార్తీకమాస దీపాలను వెలిగించి పరవశించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై ఉమామహేశ్వర వ్రతాన్ని నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి(Beeram Madhava Reddy), ఈఓ శ్రీనివాస రావు భక్తులకు ఎలాంటి అసౌఖర్యాలు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి భక్తులను చేరవేర్చేందుకు అదనంగా బస్సు సౌఖర్యాన్ని కల్పించారు. సిద్దాపూర్ ఆరోగ్య కేంద్రం ద్వారా భక్తులకు ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసారు. డిఎస్పీ పల్లె శ్రీనివాసులు(DSP Palle Srinivas) నేతృత్వంలో సిఐ నాగరాజు, ఎస్సై సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించి రద్దీని క్రమబద్దీకరించారు.

