రాజన్న- భీమన్న ఆలయంలో కార్తీక సందడి

రాజన్న- భీమన్న ఆలయంలో కార్తీక సందడి

  • స్వామి వారిని దర్శించుకున్న 60 వేల మంది
  • ఆలయ ఖజనాకు రూ.40లక్షల ఆదాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sri Rajarajeswara Swami) వారి ఆలయంతో పాటు అనుబంధ భీమేశ్వర ఆలయంలో కార్తీక సందడి నెలకొంది. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కార్తీక మాస సోమవారం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షే త్రానికి తరలివచ్చారు.

తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో(queue lines) బారులు తీరారు. రాజన్న, భీమన్న ఆలయాల్లో స్వామివార్లని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ. 40 లక్షల ఆదాయం(Rs. 40 lakhs income) సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply