తులసి కోటకు.. కార్తీక పూజలు

తులసి కోటకు.. కార్తీక పూజలు

మోత్కూర్, (ఆంధ్రప్రభ)
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మహిళలు తమ గృహాల్లో తులసి కోటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాము ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఉసిరి దీపాలతో పాటు 365 ఒత్తులు కలిగిన దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పెద్దమ్మ తల్లి, సాయిబాబా ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున వేకువ జాము నుండే కార్తీక దీపాలు వెలిగించారు. తమ నివాస గృహాల ప్రధాన ద్వారాల (గుమ్మాల) వద్ద గుమ్మడి కాయలు కొట్టి, దీపాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆవు పేడ, మారేడు దళాలతో పురోహితులు పి లక్ష్మణ మూర్తి శర్మ ప్రత్యేకంగా చేసిన శివలింగం వద్ద ఈ రోజు ఉదయం 5 గంటల 18 ని.లకు 519 ఒత్తులతో కూడిన కార్తీక దీపాన్ని వెలిగించారు. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 10 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం, సాయిబాబా ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకుని మధ్యాహ్న హారతితో పాటు భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు.

Leave a Reply