Road accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి..

Road accident | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పెద్దదోబ గ్రామ సమీపంలో గురువారం రాత్రి రెండు బైకులు ఢీకొని ఉయిక కార్తీక్ కుమార్, నితిన్ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన జైనూర్ మండలంలోని రాసిమెట్ట గ్రామానికి చెందిన ఉయిక కార్తీక్ కుమార్ కు జైనూర్ 108 అంబులెన్స్ ఈఎంటి శ్రీకాంత్ పైలట్ ఆడ దయాకర్ లు 108 అంబులెన్స్ లో ఈఎంటి చికిత్సలు చేస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి తరలిస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో మార్గం మద్యంలోనే మృతి చెందారని కార్తీక్ బంధువులు ఈఎంటి ప్రశాంత్ పైలట్ ఆడ దయాకర్ లు శనివారం తెలిపారు. 108 లో ఆక్సిజన్ పెట్టి చికిత్సలు చేస్తూ తీసుకువెళ్లిన ఫలితం దక్కలేదని ఆసుపత్రి కి చేరుకోక ముందే మృతి చెందారని వారు తెలిపారు.

Leave a Reply