కరీంనగర్ శాతవాహన కాన్వకేషన్ వేడుకలు

కరీంనగర్ శాతవాహన కాన్వకేషన్ వేడుకలు

హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ


ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ద్వితీయ కాన్వకేషన్ వేడుకలు శుక్రవారం పండుగలా నిర్వ‌హించారు. యూనివర్సిటీ.. ప్రాంగణంలో జరిగిన వేడుకలకు.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) హాజరయ్యారు. పోలీస్ గౌరవ వందనంతో గవర్నర్ కు యూనివర్సిటీ సిబ్బంది స్వాగతం పలికారు.

ఈసందర్భంగా గవర్నర్ విద్యార్థులకు పీహెచ్ డీ పట్టాలను (PhD degrees), బంగారు పతకాలను అందజేశారు. ఇందులో 25మంది పీహెచ్డీ పట్టాలు పొందగా, 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబర్చిన 161మందికి బంగారు పతకాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి జేబీరావు, శాతవాహన వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

Leave a Reply