Karimnagar | రెండో రౌండ్ లోనూ బిజెపి అభ్యర్ధి అంజిరెడ్డి లీడ్

క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి బిజెపి అభ్యర్ధి అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్ధుల కంటే 1492 ఓట్ల ఆధీక్యంలో ఉన్నారు.. రెండో రౌండ్ ముగిసే నాటికి అంజిరెడ్డి కి 14,690 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్ధి నరేందర్ రెడ్డికి- 13,198 ఓట్లు ల‌భించ‌గా, బిఎస్పీ అభ్య‌ర్ధి ప్రసన్న హరికృష్ణ – 10,746 ఓట్లు సాధించారు.

ఫ‌స్ట్ రౌండ్ లో

తొలి రౌండ్ పూర్త‌య్యే స‌రికి బీజేపీ అభ్య‌ర్థి అంజిరెడ్డి 24 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఇందుకు 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. క‌రీంన‌గ‌ర్‌-మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 3,55,159 ఓట్లకు గాను 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుమారు 27,671 ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మొద‌టి రౌండ్ పూర్త‌య్యే స‌రికి కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌రేంద‌ర్‌ రెడ్డి 6673 ఓట్లు, బీజేపీ అభ్య‌ర్థి అంజిరెడ్డి 6697 ఓట్లు, బీఎస్‌పీ అభ్య‌ర్థి ప్ర‌స‌న్న‌హ‌రికృష్ణ‌కు 5897 ఓట్లు ల‌భించాయి.

Leave a Reply