కరీంనగర్, ఆంధ్రప్రభ : అత్యంత ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కీలక దశకు చేరుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కోటా ఓటుకు చేరకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఫలితాన్ని తేల్చనున్నాయి. దీంతో ఎలిమినేషన్ ప్ర్రక్రియను అధికారులు ప్రారంభించారు.. ఇప్పటికే 53 మంది అభ్యర్ధులను ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు ప్రధాన అభ్యర్ధులు మాత్రమే మిగిలారు.. ఇప్పుడు వారి రెండో ప్రధాన్యత ఓట్లను లెక్కించనున్నారు..
ఈ 53 మంది ఎలిమినేట్ అయిన తర్వాత బిజెపి అభ్యర్ధి అంజిరెడ్డి 4,991 ఓట్ల ఆధీక్యంలో ఉన్నారు.. ఆయనకు ఇప్పటి వరకు అంజిరెడ్డికి 78,635 ఓట్లు పోలయ్యాయి.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు, బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు 63,404 పోలయ్యాయి. మొత్తం చెల్లిన 2,24,336 ఓట్లలో 1,12,169 ఓట్లు ఎవరు సాధిస్తారే వారినే విజేతగా ప్రకటిస్తారు..