Karimabad | ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన ట్రాఫిక్ సీఐ

Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని 34వ డివిజన్ శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం కాలని వరంగల్ ట్రాఫిక్ సీఐ సుజాత ఈ రోజు సందర్శించారు. ఈనెల 30న కాలనీలోకి భారీ వాహనాలు కల్వర్టు, మోరీలు ధ్వంసం అనే కథనాన్ని ఆంధ్రప్రభ ప్రచురించింది. స్పందించిన ట్రాఫిక్ సిఐ సుజాత కాలనీ సందర్శించి ఆ ప్రాంతంలోని కాలనీలను పరిశీలించారు. సీఐ సందర్శన సందర్భంగా కూల్ డ్రింక్స్ వాటర్ గోదాములు మూసి ఉండడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. కాలనీలోకి భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటామని డివిజన్ ప్రజలకు తెలిపారు. సమీపంలోని దేవాలయం, స్థానికులు, పూజారుల ఆహ్వానం మేరకు దేవాలయంలో ట్రాఫిక్ సీఐ పూజలు నిర్వహించి పూజారుల ఆశీర్వాదం స్వీకరించారు.
