karate | గోదావరిఖని విద్యార్థుల కరాటే ప్రతిభకు..

karate | గోదావరిఖని విద్యార్థుల కరాటే ప్రతిభకు..

  • జాతీయ స్థాయి గుర్తింపు
  • ఇంటర్-స్టేట్ కరాటే పోటీల్లో రెడ్ డ్రాగన్ ఇన్స్టిట్యూట్ ఘన విజయం

karate | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : కరాటే క్రీడలో గోదావరిఖని విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ఈనెల 4వ తేదీన కరీంనగర్‌లోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇంటర్-స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 జాతీయ స్థాయి పోటీల్లో గోదావరిఖనికి చెందిన ఒకినావా రెడ్ డ్రాగన్ కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విశేష విజయాలు సాధించారు.

ఈ పోటీల్లో ఇన్స్టిట్యూట్‌కు చెందిన 10మంది విద్యార్థినులు పాల్గొని తమ కరాటే నైపుణ్యంతో మెప్పించారు. ఫలితంగా గోల్డ్ మెడల్స్–4, సిల్వర్ మెడల్స్–2, బ్రాంజ్ మెడల్స్–3తో పాటు జాతీయ స్థాయి కప్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థుల్లో పి.దేవాన్ష్, ఏ.మాన్విత్, ఈ.ఆరాధ్య, ఆర్.అలాన్, ఆర్.ఆకాష్, కె.ఆశిత్వరన్, జె.రాజా, కె.విష్ణు వర్ధన్, ఎన్. మోహీద్ తదితరులున్నారు. వారి ప్రదర్శన ప్రేక్షకులు, నిర్వాహకుల ప్రశంసలు పొందింది.

ఈ విజయానికి ప్రధాన కారణమైన కరాటే శిక్షకులు హచిండాన్ కె.మొండయ్య (8వ డాన్ బ్లాక్ బెల్ట్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్)తో పాటు సీనియర్ కోచ్ క్రాంతి కుమార్ విద్యార్థులను అభినందించారు. క్రమశిక్షణ, కఠిన సాధనతో ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు. గోదావరిఖని కరాటే క్రీడకు ఇది గర్వకారణమని స్థానిక క్రీడాభిమానులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply