తాళాలు వేసిన ఇండ్లకే కన్నాలు…
— దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్
— 5తులాల 14 గ్రాముల బంగారం
— 2.85 లక్షల నగదు బైక్ స్వాధీనం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆంధ్రా రాష్ట్రానికి(state of Andhra) చెందిన వ్యక్తిని ఈ రోజు హుజూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్(Huzurnagar Police Station)లో సీఐ చరమందరాజు కేసు వివరాలు తెలుపుతూ… హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపలసింగారం గ్రామంలో ఈ నెల 5న తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, 90 వేల నగదు దొంగించబడ్డాయని బాధితుడు ముడెం గోపిరెడ్డి(Mudem Gopi Reddy) ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గోపిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్ళగా అది గమనించిన మల్లికార్జున్ రెడ్డి (ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామం) తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు 90 వేల రూపాయల నగదు(gold ornaments, cash worth Rs. 90 thousand)ను దొంగించుకు పోయాడు.
దొంగిలించిన బంగారాన్నీ కరగపోయించి మిర్యాలగూడెంలో అమ్మడానికి వెలుచుండగా హుజూర్ నగర్ ఎస్ఐ మోహన్ బాబు ఈ రోజు వాహనాలు తనిఖీలు చేస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
నేరస్తుడు బి టెక్ చదివి ఉద్యోగం రాకపోవడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పడుతున్నాడని గతంలో ఈ వ్యక్తి పై కేసులు నమోదు అయినట్లు తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి 5 తులాల 14 గ్రాముల బంగారం, 90 వేల నగదు, ఒక బైక్, సెల్ పోన్(bike, cell phone) స్వాధీనం చేసుకునామన్నారు.
సీసీ కెమెరాల పుటేజీ సహాయంతో కేసును త్వరిత గతిన ఛేదించిన ఎస్ఐ మోహన్ బాబు, సిబ్బంది నాగరాజు శంభయ్య, వీరప్రసాద్ వెంకటేశ్వర్లులను అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు పోలీస్ సిబ్బంది నాగరాజు శంభయ్య వీరప్రసాద్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

