Kammarpally | సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Kammarpally | సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
Kammarpally | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళలు చైతన్యవంతం కావాలంటే చదువు ఒక్కటే ఆయుధమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ.. మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల మహిళా అధ్యాపకులైన వైష్ణవి, సుమతి, స్రవంతిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మధు, వెంకటేష్, గంగాధర్, మహేందర్, గంగారాం, శ్రీహరి, మురళీకృష్ణ, ఆనంద్ కిషోర్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
