రాష్ట్ర స్థాయి హిందీ ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక

రాష్ట్ర స్థాయి హిందీ ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఫాతిమా పిర్దోస్ రాష్ట్రస్థాయి హిందీ ప్రతిభ పరీక్షకు ఎంపికై పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చింది. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి హిందీ పోటీలలో ఫాతిమా అద్భుతమైన ప్రతిభను కనబరిచి, ఉన్నత మార్కులతో ఈ ఘనత సాధించింది. త్వరలో హైదరాబాదులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో ఆమె పాల్గొననుంది. విద్యార్థిని సాధించిన ఈ విజయంలో పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు రత్నమాల కృషి ఎంతో ఉందని పాఠశాల వర్గాలు తెలిపాయి. రత్నమాల విద్యార్థినికి ప్రత్యేక శిక్షణనిస్తూ, హిందీ భాషపై పట్టు సాధించేలా ప్రోత్సహించడంతోనే ఈ ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, సర్పంచ్ హారిక, ఉపసర్పంచ్ అశోక్, విడిసి అధ్యక్షుడు రామస్వామి, ఉపాధ్యాయ బృందం ఫాతిమా పిర్దోస్‌ను, ఆమెకు మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయురాలు రత్నమాల ని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఫాతిమా ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
