Kaleswaram Commission | అయిదో తేదిన రాలేను …11న వస్తా – కాళేశ్వర కమిషన్ కు కెసిఆర్ లేఖ

హైద‌రాబాద్ – కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన‌ కాళేశ్వరం కమిషన్ విచార‌ణ‌కు ముందుగా నిర్ణ‌యించిన తేదికి రాలేన‌ని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆ క‌మిష‌న్ కు లేఖ రాశారు.. ఈ నెల 11 వ తేదిన విచార‌ణ‌కు హాజర‌వుతాన‌ని, అందుకు అనుమ‌తి ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరారు.. దీనికి క‌మిష‌న్ ఓకే చెబుతూ స‌మాధానం ఇచ్చింది.. దీంతో కెసిఆర్ ఈ క‌మిష‌న్ విచార‌ణ కోసం ఈ నెల 11 న హాజ‌రుకానున్నారు.. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే నోటీసులు జారీ చేసింది.

Leave a Reply