Kakinada | లారీ ఢీకొని..

Kakinada | లారీ ఢీకొని..
- వృద్ధుడు మృతి
Kakinada | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రోడ్డు దాటుతున్నవృద్ధుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో గండేపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై శివనాగ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన శిలం శివరామకృష్ణ (60) ఇవాళ ఉదయం సైకిల్ పై మల్లేపల్లి సంత మార్కెట్ వద్ద ఉన్న డివైడర్ దాటుతుండగా జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శివరామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. శివరామకృష్ణ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు, ముగ్గురికి వివాహమైనట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
