Kajjarla village | ఒక్క అవకాశం ఇస్తే..

Kajjarla village | ఒక్క అవకాశం ఇస్తే..

Kajjarla village | తలమడుగు, ఆంధ్ర ప్రభ : ఈనెల 17న జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కజ్జర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి సురుకుంటి వెంకటరెడ్డి కజ్జర్ల గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. తమ గుర్తు ఫుట్ బాల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్లయితే కజ్జర్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. సర్పంచ్ గా విజయం సాధించిన వెంటనే పూర్తి సమయాన్ని గ్రామ అభివృద్ధి కోసం కేటాయిస్తానని పేర్కొన్నారు. ప్రజల కనీస అవసరాలైన త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటును ఫుట్ బాల్ గుర్తుకు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply