Kadem | మహిళల విద్యాభివృద్ధికి ఎన‌లేని సేవ‌లు

Kadem | మహిళల విద్యాభివృద్ధికి ఎన‌లేని సేవ‌లు

  • ఘ‌నంగా సావిత్రిబాయి జ‌యంతి
  • ఏలగడప సర్పంచ్ నర్సింగ్ అశ్విత

Kadem | కడం(నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళలు, బాలికల విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలు ఎనలేనివని ఏలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్ అన్నారు. కడెం మండలం ఎలగడప గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం కుచనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జ‌యంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మహిళా టీచర్లు కావ్య, సన కౌసర్, జ్యోత్స్న‌ల‌ను స‌న్మానించారు.

ఈ కార్యక్రమం లో ఎలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్, ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహమ్మద్ సలీం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అబ్దుల్ రహీం, నాయకులు మల్లేష్, కొండవేని రాజేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply